తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు విఫలం

ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థం కాకుండా ఉందన్నారు. 30 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లుగా కనిపించడం లేదన్నారు. తెలంగాణపై ప్రకటన వెలువడే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయాలన్నారు. చర్చలకు రావాలంటే ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని, జివో 177 రద్దు చేయాలని, తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉద్యోగులపై హత్యాయత్నం చేసిన వారిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని, ఎస్మా రద్దు చేయాలని తదితర డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు.












Click it and Unblock the Notifications