తెలంగాణ సెగ: 124 రైళ్లు రద్దు, ప్రభుత్వ బీరాలు ఉత్తవే

సికింద్రాబాద్ - కాజిపేట, సికింద్రాబాద్ - వాడి, వికారాబాద్ - పార్లీ, నడికుడి - బీబీనగర్, సికింద్రాబాద్ - ముద్ఖేడ్, విజయవాడ - కాజిపేట - బల్హార్షా, సికింద్రాబాద్ - డోన్, డోర్నకల్ - మణగూరు, నిజామాబాద్ - బోధన్, పెద్దపల్లి - జగిత్యాల, ఆదిలాబాద్ - కిన్వత్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలపై రైలో రోకో ప్రభావం పడనుంది. దక్షిణ మధ్య రైల్వే మూడు రోజుల పాటు 124 ప్యాసెంజర్ రైళ్లను పూర్తిగా, 38 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తోంది. 68 రైళ్లను దారి మళ్లిస్తోంది. 19 రైళ్లను రీషెడ్యూల్ చేస్తోంది. ఎనిమిది రైళ్లను నియంత్రిస్తోంది. సికింద్రాబాద్ - లింగపల్లి, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయి. ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్ మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు రద్దవుతున్నాయి.












Click it and Unblock the Notifications