చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలి: నారాయణ

Narayana
మహబూబ్‌నగర్, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిల్‌పై ఆయన సోమవారం మహబూబ్‌నగర్‌లో ప్రతిస్పందించారు. తప్పు చేసినట్లు విచారణలో తేలితే చంద్రబాబును శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే చంద్రబాబు అక్రమ ఆస్తులు ఎప్పుడో బయట పెట్టి ఉండేవారని ఆయన అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలని బిజెపి జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబుపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో గుర్తు చేశారు. కోర్టు విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, అవినీతి విషయంలో తమ పార్టీ ఎవరికీ మినహాయింపు ఇవ్వదని ఆయన అన్నారు. నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+