చంద్రబాబు తెలంగాణ పర్యటన ఊసు, కెసిఆర్ టార్గెట్

ఫైళ్లు తారుమారు కాక ముందే పోలవరం ప్రాజెక్టు టెండర్ల ఫైలును శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని చంద్రబాబు ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుత టెండర్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. టెండర్లను ఖరారు చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. అవినీతి కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగతోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారాన్ని కెసిఆర్‌కు వ్యతిరేకంగా సంధించడానికి ఆయన ఇప్పటికే పూనుకున్నారు. అదే సమయంలో తాను నవంబర్‌లో తెలంగాణలో పర్యటిస్తానని ఓ ప్రచారాన్ని అమలులో పెట్టారు. నవంబర్ 2వ తేదీన చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లాతో ప్రారంభమై తెలంగాణలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications