రాఘవేంద్ర తీర్థ స్వామీజీ అరెస్టు, విగ్రహాల స్వాధీనం

కాశీ మఠానికి చెందిన విగ్రహాలను, చరాస్థులను, ఇతరాలను వెంటనే సుధీంద్ర తీర్థ స్వామీజీకి అప్పగించాలని ఇంతకు ముందు తిరుపతి కోర్టు ఆదేశించింది. దాంతో రాఘవేంద్ర హైకోర్టుకు వెళ్లాడు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. తాను మతపరమైన పర్యటనలో ఉన్నానంటూ వాటిని అప్పగించేందుకు రాఘవేంద్ర తీర్థ నిరాకరించారు. అక్టోబర్ 12వ తేదీన ఇందిరానగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఓ ల్యాప్‌టాప్‌ను, 600 ఏళ్లనాటి లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని, కొన్ని పంచలోహ విగ్రహాలను, పులి గోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా రాఘవేంద్ర తీర్థ స్వామీజీపై కేసులున్నాయి.












Click it and Unblock the Notifications