తెరాసలోకి మరింత మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకపోతే తాను పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనకాడబోనని మాజీ మంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇంకా చాలా మందే తెరాస వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి, అటు కాంగ్రెసు నుంచి తెరాసలోకి వలసలు పెరుగుతాయని అంటున్నారు.
తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణి వల్ల కాంగ్రెసు ప్రజాప్రతినిధులు విసిగిపోయారని, అంతేకాకుండా అధిష్టానం సీమాంధ్ర పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గుతుందని చాలా మంది కాంగ్రెసు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో యధావిధిగా కాంగ్రెసు పార్టీలో కొనసాగడం వల్ల తమ నియోజకవర్గాల్లో పూర్తిగా ఉనికి కోల్పోతామని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీని వీడడానికి వారు సిద్ధపడుతున్నారు. అయితే, వారు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి తమకే టికెట్ ఇవ్వాలనేది వారు కోరుతున్న హామీ. అందుకు కెసిఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications