కెసిఆర్ తీరును తప్పు పట్టిన బిజెపి నేత కిషన్ రెడ్డి

Kishan Reddy
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పు పట్టారు. కెసిఆర్ పేరుగానీ, తెరాస పేరు గానీ ప్రస్తావించకుండా ఆయన పరోక్ష వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన పార్టీలు ఇతర పార్టీల శాసనసభ్యులతో బలపడాలని అనుకోవడం సరి కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెరాసలోకి తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యుల వలసలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి కొన్ని పార్టీలు తప్పుకున్నా ప్రజలే ఉద్యమాన్ని నడిపిస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై చర్చించేందుకు వెంటనే శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రపతి పాలనను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కెసిఆర్ మాటల యుద్ధం చూస్తుంటే జుగుప్స కలుగుతోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి, వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నేరారోపణలు రుజువైతే పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+