జగన్‌తో కలిస్తే భంగపాటే: కెసిఆర్ వ్యాఖ్యలపై యాష్కీ

Madhu Yashki
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిస్తే గెలవవచ్చునని అనుకుంటే భంగపాటు తప్పదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు తెరాసలో చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. కాంగ్రెసు తెరాసలో విలీనమైతే తెలంగాణ రాదని, తెరాస కాంగ్రెసులో విలీనమైతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులెవరూ తెరాసలో చేరబోరని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉందని గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన విమర్శించారు.

తెలంగాణపై పార్టీ అధిష్టానం జాప్యం చేస్తున్న కారణంగానే ముగ్గురు శాసనసభ్యులు తమ పార్టీని వీడారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కె. కేశవరావు అన్నారు. శాసనసభ్యులు కాంగ్రెసును వీడడం దురదృష్టకరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముగ్గురు శాసనసభ్యులు తమ పార్టీలో చేరడంతో కెసిఆర్ అత్యుత్సాహంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ శాసనసభ్యులను కట్టడి చేయడంలో తాను, మంత్రి కె. జానారెడ్డి విఫలమయ్యామని ఆయన అన్నారు. ముగ్గురు శాసనసభ్యులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెసును వీడారే గానీ తెలంగాణ కోసం కాదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. బొత్స సత్యనారాయణ కించపరిచేలా మాట్లాడారని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెసును వీడారని ఆయన అన్నారు.

రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలినా నష్టం లేదని, వచ్చేది రాష్ట్రపతి పాలనే అని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణకు చెందిన ఎంత మంది రాజీనామా చేసినా నష్టం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బలహీనపడిన తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదికి తెచ్చేందుకే తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+