వాళ్లే తిరిగి వస్తారు: తెలంగాణ ఎమ్మెల్యేలపై రాయపాటి

సీమాంధ్ర ప్రజల మనోభావాలే తనకు ప్రధానమని, తమకు వ్యక్తిగత ఎజెండా లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన వల్లనే రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడలో చేసిన తీర్మానాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో అమలు చేయలేదని ఆయన అన్నారు.
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నమ్మదగ్గ నాయకుడు కారని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో శానససభ్యులను తీసుకుని పోవడమే కెసిఆర్ వ్యూహమని, దాని వల్ల తమకు నష్టమేమీ లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ దుష్ట ఆలోచనలకు శానససభ్యులు బలి కావద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications