కెసిఆర్ విలీనం వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేసిన బొత్స

శాసనసభలో విశ్వాసం కోరాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే వంద శాతం నెగ్గుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం నవంబర్ 1వ తేదీ నుంచి తలపెట్టిన దీక్షను మానుకోవాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరుతామని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని వీడి తెరాసలో చేరిన శానససభ్యులది తొందరపాటు చర్యేనని కాంగ్రెసు ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాతో ప్రభుత్వం మైనారిటీలో పడలేదని ఆయన అన్ారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు.
ముగ్గురు శానససభ్యులు తమ కాంగ్రెసు పార్టీని వీడడం వారి వ్యక్తిగత నిర్ణయమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం మహబూబ్‌నగర్‌లో అన్నారు. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామా వల్ల ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ సముద్రంలాంటిదని, అందులోకి వస్తుంటారూ పోతుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications