వైయస్ జగన్, కెసిఆర్‌ను కడిగేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వైయస్సార్ కాంగ్రెసు, కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెసు పార్టీ అనుబంధ పార్టీలనన్నారు. ఆ మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. జగన్‌కు, కెసిఆర్‌కు ఒక్కో భక్తి చానల్(పొగుడుకునే సొంత ఛానళ్లు) ఉందన్నారు. కెసిఆర్ ఛానళ్లో జగన్ అక్రమాల గురించి రాదు, జగన్ ఛానళ్లో కెసిఆర్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీను డబ్బులకు అమ్ముకున్న అంశంపై రాదని విమర్శించారు. జగన్, కెసిఆర్, కాంగ్రెసు కలిసి మురికి కాలువలో పడ్డా తమకు అభ్యంతరం లేదని కానీ టిడిపిని విమర్శిస్తే సహించేది లేదన్నారు.

తమపై విమర్శలు చేసే వారిది రాజకీయ అజ్ఞానమన్నా కావాలి లేక బురదజల్లే యత్నమన్నా కావాలన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో టిడిపి కిరణ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే దమ్ము మీకుందా స్పష్టం చేయాలన్నారు. వైయస్ హయాంలో పదిమంది శాసనసభ్యులను అమ్ముకున్న కెసిఆర్ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడు పోయిన వారిని మళ్లీ ఎందుకు తీసుకున్నారో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెసుకు అవసరమైనప్పుడల్లా కెసిఆర్ డబ్బులకు అమ్ముడుపోయి ఆదుకుంటాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్‌లోకి ప్రజాప్రతినిధులను చేర్పించుకొని అటునుండి కాంగ్రెసు, జగన్ పార్టీలోకి పంపిస్తారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే చిత్తశుద్ధి జగన్‌, కెసిఆర్‌కు ఉంటే వారే పడగొట్టవచ్చునన్నారు.

జగన్ 26 మంది, కెసిఆర్ 17 మంది ఎమ్మెల్యేలు కలిసి గవర్నర్ దగ్గర వెళ్లి పరేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే వారు వెనక్కి వెళుతున్నారన్నారు. వారిద్దరు కలిసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టవచ్చునన్నారు. ఈ సమావేశాలలో మేం అవిశ్వాస తీర్మానం పెడతాం అప్పుడు ప్రజలకు ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు. కాంట్రాక్టులు పొందడానికో, రాజకీయ ప్రయోజనాలకో శాసనసభ్యులను అమ్ముకొని సమస్యలను కెసిఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌కు అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారో కూడా తెలియదా అని ప్రశ్నించారు. కిరణ్ సర్కారు మైనార్టీలో పడిందని బలనిరూపణలు ఆదేశించాలని ఆయన గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+