• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్టోబర్‌లో 16 శాతం ఉద్యోగాలు మటాష్: నౌకరీ

By Nageswara Rao
|

Hiring activities down 16 pc in October, says Naukri.com
న్యూఢిల్లీ: నౌకరీ జాబ్ పొర్టల్ నిన్న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత మార్కెట్లో యూరప్ మాంద్యం వల్ల అక్టోబర్ నెలలో ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. దీనికి అంతటికి కారణం ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకొస్తున్న ఆర్దిక మ్యాందమేనని రిపోర్ట్‌లో వెల్లడించింది.

గతేడాది ఇదే నెల నియామ కాలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టో బర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ 16 శాతం తగ్గిపోయిందని తమ సూచీలో వెల్లడయ్యిందని తెలిపింది. ముఖ్యంగా ఐటి రంగంలో నియామ కాలు పెద్ద ఎత్తున 26 శాతం తగ్గి పోయాయని వెల్లడించింది. ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో 13 నుంచి 19 శాతం తగ్గుదల నమోదు చేసుకుందని పేర్కొంది. ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌, చెన్నై, పూనే ప్రాంతాల్లో 15 శాతం నుంచి 18 శాతం తగ్గుదల చోటు చేసుకొవడం జరిగింది.

ఇటీవల జరిగిన 'యాడ్‌ఏషియా-2011"లో పాల్గొన్న పెప్సీకో చైర్‌పర్సన్ ఇంద్రా నూయి ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ప్రస్తుతం మూడు సంక్షోభాల మధ్య చిక్కుకున్నాయని అన్నారు. మొదటిది కార్పొరేట్లలో నాయకత్వ సంక్షోభం కాగా రెండోది పాలనాపరమైనదని.. మూడోది జవాబుదారీతనమని ఆమె చెప్పారు. కార్పొరేట్లలో సరైన నాయకత్వ ధోరణి, గవర్నెన్స్ లోపించడమే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to recruitment portal Naukri.com's monthly job index, online hiring declined by 16 per cent in October vis-a-vis the month of September as recruitment activities saw a dip in most key sectors, including IT and banking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more