వైయస్ జగన్ దుమ్ము దులిపిన ఆంధ్రజ్యోతి డైలీ

Andhrajyothy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక తన దాడిని ఆపలేదు. సిబిఐ ముందు హాజరైన తర్వాత వైయస్ జగన్ చేసిన ప్రకటనపై ఆంధ్రజ్యోతి దినపత్రిక విరుచుకుపడుతూ శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్ జగన్ చేసిన ప్రకటనలో అబద్ధాలున్నాయంటూ దుమ్మెత్తిపోసింది. పస లేని వాదనతో జగన్ అడ్డంగా దొరికిపోయాడని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 64 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారని జగన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పింది. పాత జీవో పట్టుకుని జగన్ ఎదురుదాడి చేశారని వ్యాఖ్యానించింది. రెండు నెలల్లో ముగిసే లీజును వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే 13 ఏళ్లు పొగిగించిందని తెలిపింది.

కాంగ్రెసు ప్రభుత్వం 64 ఎకరాల ఓబుళాపురం భూములను రామ్మోహన్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికి లీజుకు ఇచ్చిందని, రామచంద్రా రెడ్డి మరణంతో ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి తెర మీదికి వచ్చారని, ఇదంతా కూడా కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, చంద్రబాబు రామ్మోహన్ రెడ్డి లీజును రెన్యువల్ చేసిందని తెలిపింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజును బదిలీ చేసినప్పుడు ఆ ఒప్పందం 2004 డిసెంబర్ 13వరకు మాత్రమే వర్తిస్తుందని, అయితే దాన్ని 1997ను ప్రాతిపదికగా తీసుకుని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 20 ఏళ్ల పాటు లీజును పొడిగించిందని వివరించింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒకే రోజు 270 ఎకరాలను దారాదత్తం చేసిందని తెలిపింది. తేదీల వారీగా వ్యవహారం ఎలా నడిచిందో ఆంధ్రజ్యోతి వార్తాకథనం వివరించింది. జగన్ వాదనలో అసంబద్ధతను ఎత్తి చూపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+