ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు అరెస్టు

శుక్రవారంనాడు రెడ్డిగూడెం రచ్చబండకు వస్తున్న మంత్రి పార్థసారథి కారుపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్థసారథి కారును వెళ్లనీయకుండా దేవినేని ఉమా రోడ్డుపై బైఠాయించారు. సాగునీటి సమస్యపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, రచ్చబండ వేదిక మీదికి రావాలని తాను సూచించినా దేవినేని ఉమా వినలేదని మంత్రి పార్థసారథి అంటున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావుది రౌడీ నేపథ్యమని, ఆందోళన చేసి వెళ్లిపోయినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. సాగునీటి కోసం పోరాడుతుంటే ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఉమా మహేశ్వరావు ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని, రైతుల కోసం పోరాటం కొనసాగిస్తానని ఆయన అన్నారు.
ఉమా మహేశ్వర రావును అరెస్టు చేసి పోలీసులు మైలవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పది వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తిపై ఆయనకు బెయిల్ మంజూరైంది. ఉమా మహేశ్వర రావు అరెస్టును తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు ఖండించారు. రైతుల కోసం ఉద్యమించిన ఉమా మహేశ్వర రావును అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications