చేనేత ప్రతినిధులపై శంకరరావు వీరంగం, రసాభాస

P Shankar Rao
నల్లగొండ: జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు మరోసారి సంచలనం సృష్టించారు. నల్లగొండలో శనివారం జరిగిన చేనేత కార్మికుల సమీక్షా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సమస్యలకు చేనేత ప్రతినిధులే బాధ్యులని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చేనేత ప్రతినిధులు ఆయనను తీవ్రంగా అభ్యంతర పెట్టారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. సమావేశం మధ్య నుంచే మంత్రి వెళ్లిపోయారు.

చేనేత కార్మిక సంఘాల నేతలను ఆయన బ్రోకర్లుగా అభివర్ణించారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఆయన వారి పట్ట అమర్యాదగా ప్రవర్తిస్తూ బ్రోకర్లుగా అభివర్ణించారు. దీంతో గొడవ ప్రారంభమైంది. కార్మికులు ఆందోళనకు దిగారు. కాగా, తాను ఈ నెల 14వ తేదీన తెలంగాణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి దీక్షా శిబిరానికి మంత్రి శంకరరావు వ్చచారు. ఆయనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తాను మంత్రిగా ఇక్కడికి రాలేదని, వైద్యుడిగా వ్చచానని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+