తెలంగాణపై ఈ నెలలోనే ప్రకటన, సిఎంగా డిఎస్?

Telangana
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ప్రకటన వెలువరించవచ్చునని వార్తాకథనాలు వచ్చాయి. ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కథనం ప్రకారం - ఈ నెల 8వ తేదీ తర్వాత ఏ రోజైనా తెలంగాణపై ప్రకటన వెలువడవచ్చు. జనవరిలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ శుక్రవారం చెప్పినప్పటికీ ఈ నెలలోనే ప్రకటన వెలువరించి, అనిశ్చితికి తెర వేయాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలో పెద్ద యెత్తున బలగాలను మోహరించినట్లు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శనివారం మాట్లాడే అవకాశాలున్నాయి. ముందస్తు భద్రతాచర్యలను చిదంబరం సమీక్షించే అవకాశం ఉంది.

తెలంగాణపై ప్రతికూల ప్రకటన చేసేందుకే ఈ ప్రాంతంలో పెద్ద యెత్తున బలగాలను మోహరించినట్లు చెబుతున్నారు. తెలంగాణకు ఇచ్చే ప్యాకేజీలో భాగంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డి. శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97 కంపెనీల పోలీసు బలగాలున్నాయి. వీటిని ముఖ్యమైన విశ్వవిద్యాలయాల వద్ద, కాలేజీల వద్ద మోహరించనున్నారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+