వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైర్

Telugudesam
అనంతపురం/ నెల్లూరు: సిబిఐ ముందు హాజరైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సిబిఐ జగన్‌ను విచారించిందా, జగన్ సిబిఐని విచారించారా అని తెలుగుదేశం శానససభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డితో సంబంధం లేదని జగన్ చెప్పిన మాటల్లో నిజం లేదని ఆయన శనివారం అనంతపురంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ ఎదుట హాజరైన జగన్ లోపల ఏం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసత్యాలు, అర్థసత్యాలతో ప్రజలను మోసం చేయవద్దని ఆయన జగన్‌కు సూచించారు. ఆర్ఆర్ గ్లోబల్ సంస్థ పేర గనుల సొమ్మును దోపిడీ చేసిన విషయం ఎందుకు వెల్లడించడం లేదని ఆయన అడిగారు. విశ్వసనీయతకు మారు పేరుగా చెప్పుకునే జగన్ జనార్దన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని ఇప్పుడు అంటే ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డితో జగన్‌కు గల సంబంధాల గురించి లోకానికి తెలుసునని ఆయన అన్నారు.

అక్రమాస్తులు, ఎమ్మార్ కుంభకోణఁ, ఒఎంసి అక్రమాల కేసుల్లో దోషిగా ుఉన్న జగన్‌ను సిబిఐ విఐపిలా చూడడం తగదని తెలుగుదేశం మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విచారణకు హాజరైన జగన్‌ను సిబిఐ అతిథిలా చూసిందని ఆయన శనివారం నెల్లూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు మారు పేరుగా చెప్పుకునే జగన్ సిబిఐ ఎదుట అంతా అవాస్తవమే చెప్పారని ఆయన అన్నారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు జగన్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులోకి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బోఫోర్స్ కేసు మాదిరిగా కాకుండా జగన్‌పై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కొండా లక్ష్మణ్ బాపూజీ చేపట్టిన దీక్షను విరమింపజేయాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+