నిట్ విద్యార్థి ఆత్మహత్య, గోదావరిలో ఏడుగురు గల్లంతు

కాగా మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు విద్యార్థులతో సహా లక్ష్మీ ప్రసన్న అనే ఉపాధ్యాయురాలు గల్లంతయ్యారు. పెరవలి మండలం కాకరపర్రు ప్రాంతంలో విహారం కోసం వెళ్లారు. స్నానం చేయడానికి గోదావరి నదిలోకి దిగిన వారు గల్లంతయ్యారు. మోహన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. గల్లంతైన మిగతా వారి కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జాలర్లు గాలిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ కూడా వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. వీరంతా తణుకు మున్సిపల్ పాఠశాల నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications