రోజుల్లో తెలంగాణపై నిర్ణయం, ప్రకటన చేసేది చిదంబరమే

P Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో అర గంట సేపు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే, ఆయన ఓ జాతీయ మీడియాకు చెందిన ప్రతినిధితో తెలంగాణపై మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. గురు పౌర్ణమి తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, ఆ నిర్ణయం ఈ నెల 10వ తేదీ తర్వాత ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య క్లిష్టమైందని, అందువల్లనే నిర్ణయంలో జాప్యం జరిగిందని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. పదో తేదీ తర్వాత నిర్ణయమని అన్నారే గానీ ఎప్పుడనేది ఆయన కచ్చితంగా చెప్పలేదు. శనివారంనాడు నిర్ణయం వెలువడవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆజాద్ చెప్పడంతో ఆ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. శుక్రవారం నిర్ణయం తీసుకున్న తర్వాత శనివారం ప్రకటన వెలువడవచ్చునని అంచనాలు వేస్తున్నారు. అయితే, తెలంగాణపై పార్టీ కోర్ కమిటీ విస్తృతంగా చర్చించిందని ఆజాద్ చెప్పారు. పార్టీపరంగా నిర్ణయం ఏదీ ఉండదని, ప్రభుత్వపరంగానే తెలంగాణణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.

కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత మిత్రపక్షాలతో చర్చిస్తారని అంటున్నారు. తుదిగా రాష్ట్రానికి చెందిన పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని అంటున్నారు. ఒక పార్టీ తెలంగాణపై ఒకే నిర్ణయం చెప్పాలనే వైఖరితో ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా అంచనాలకు అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తప్ప ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు వంటి ఎటువంటి ప్రత్యామ్నాయాలను కూడా అంగీకరించబోమని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు అంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వంటి రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులు అంటున్నారు. అదెలా ఉంటుందనేదే ఇప్పుడు ఉత్కంఠను రేపే విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+