జగనో మీరో తేల్చుకోండి: రఘువీరాకు టిడిపి నేతలు

Telugudesam
అనంతపురం/హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కదన్న మంత్రి రఘువీరా రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండదని అధికార హోదా ఉంటుందన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండేందుకు మీరు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాలన్నారు. రఘువీరా రెడ్డి జిల్లాలో ఎక్కడ గెలిచినా రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని సవాల్ విసిరారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూ.1కి కిలో బియ్యంపై టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రభుత్వం బియ్యం పథకం కేవలం ప్రచారం కోసమే ఉపయోగించుకుంటుందన్నారు. ఇచ్చే నాలుగు కిలోల బియ్యం పది రోజులు వచ్చినా మిగిలిన ఇరవై రోజులు అధిక ధర పెట్టి తినాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచార అర్భాటం కోసమే ప్రభుత్వం దీన్ని తీసుకు వచ్చిందన్నారు. తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి జయలలిత ఇరవై కిలోల బియ్యం ఇస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+