బాబు ఆస్తులను లెక్కించడం సాధ్యం కాదు: శైలజానాథ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెసు కుమ్మక్కయి వైయస్ విజయమ్మతో చంద్రబాబుపై పిటిషన్ వేయించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణను కొండ్రు మురళి ఖండించారు. ఆ వ్యవహారంలోకి కాంగ్రెసును లాగవద్దని ఆయన తెలుగుదేశం నాయకులకు సూచించారు. కేసుల నుంచి బయటపడడానికి చంద్రబాబు ప్రయత్నించాలి తప్ప తమను ఆడిపోసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించారని, నీతివంతమైన పాలనను అందిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ జగన్‌తో కుమ్మక్కయిందనే తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శల్లో నిజం లేదని రుద్రరాజు పద్మరాజు అన్నారు.
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కేసుల్లో తమకు సంబంధం లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు ఆస్తులపై విచారణకు తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు, వైయస్ జగన్ విచారణలకు సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications