2 లక్షల ఫేస్‌బుక్ ఎకౌంట్లు హాక్: బూతు బొమ్మలు

ఈ విషయంపై స్పందించిన ఫేస్‌బుక్ యాజమాన్యం స్పామ్ మొయిల్స్ ద్వారా హాకర్స్ ఈ పని చేయడం జరిగిందని తెలిపింది. దీనివల్ల కొంత వరకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని అన్నారు. రాబోయే కాలంలో ఫేస్‌బుక్ యూజర్స్‌ని స్పామ్‌తో పాటు, కొన్ని అనధికార కంటెంట్ నుండి కాపాడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పనికి పాల్పడిన వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. హాకర్స్ పంపినటువంటి ఇమేజిలలో ఎక్కవ భాగం ఇమేజిలు బూతు చిత్రాలను కలిగి ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ మంది ఫేస్‌బుక్ యూజర్స్ మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications