రచ్చబండలో సిఎం చతుర్లు, బైక్ రైసులపై అసంతృప్తి

Kiran Kumar Reddy
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం చతుర్లు విసిరారు. రచ్చబండలో సిఎం కిరణ్ మాట్లాడుతుండగా అదే పనిగా కొందరు నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని ఆపి నినాదాలు ఎక్కువగా చేస్తే చేదు అవుతుందని ఆపాలని కోరారు. మరో సందర్భంలో మహిళా సంక్షేమానికి రూ.25 లక్షలతో మహిళా శక్తి భవనాన్ని రంగారెడ్డి జిల్లా నుండే ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పినప్పుడు కొందరు అదే పనిగా అరిచారు. అందుకు సిఎం మహిళలకు నిధులు కేటాయిస్తే మీరు అరుస్తున్నారెందుకయ్యా? అక్కడి నుండి ఏమైనా ట్రాన్స్‌ఫర్ ఉందా? అంటూ చమత్కరించారు.

మూడున్నరేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాల పైనా ఆయన విపక్షాలను తనదైన శైలిలో విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన జరుగుతున్న బైక్ రేసులపై ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే బైక్ రేసులకు వినియోగించడం సరికాదని అన్నారు. బైక్ రేసులతో రోడ్డు ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+