రాజీనామాపై స్పీకర్‌ను కలిసిన జూపల్లి కృష్ణా రావు

Jupalli Krishna Rao
హైదరాబాద్: తన సమర్పించిన రాజీనామా విషయంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను మంగళవారంనాడు కలిశారు. ఆయన తన శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని జూపల్లి కృష్ణా రావు ఇది వరకే చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు కాంగ్రెసు పార్టీకి, శానససభా సభ్యత్వాలకు రాజీనామా చేసి తెరాసలో చేరిన సోమారపు సత్యనారాయణ, రాజయ్య బుధవారం స్పీకర్‌ను కలవనున్నారు.

తన రాజీనామాను స్పీకర్ చేత ఆమోదింపజేసుకుంటానని స్టేషన్ ఘనపూర్ శానససభ్యుడు టి. రాజయ్య బుధవారం వరంగల్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బుధవారం ఉదయం తాను స్పీకర్‌ను కలుస్తానని ఆయన అన్నారు. తెరాస ఇచ్చిన పిలుపు మేరకు రాజయ్య, సోమారపు సత్యనారాయణ తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఆ కార్యక్రమం ముగియడంతో వారు రేపు స్పీకర్‌ను కలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+