కెవిపి పాత్రపై ప్రభాకర్ రెడ్డి నుంచి ఆరా తీసిన సిబిఐ

వైయస్ రాజశేఖర రెడ్డి నిర్వహించే సమావేశాల్లో అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు పాల్గొనేవారా, ప్రభుత్వ నిర్ణయాల్లో కెవిపి పాత్ర ఏమిటి అని సిబిఐ అధికారులు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉండేవని, ఆయన ఆదేశాలను పేషీ అధికారులు అమలు చేసేవారని, శాఖలకు కూడా ఆదేశాలు జారీ అయ్యేవని ప్రభాకర్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. పేరుకు గనుల శాఖ తన పరిధిలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసి సహా పలు కీలకమైన నిర్ణయాలు తనకు తెలియకుండానే జరిగిపోయాయని ఆయన చెప్పారు. ఓఎంసి గురించి ఐఎఎస్ అధికారులు రాజగోపాల్, శ్రీలక్ష్మి తన వద్దకు వచ్చేవారు కారని ఆయన చెప్పారు. గనుల అనుమతుల గురించి దరఖాస్తుదారులు తన వద్దకు వచ్చేవారు కారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications