వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు రాములమ్మ, కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Vijayashanthi
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి గురువారం లోకసభలో తెలంగాణ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకు పోయారు. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు వెల్‌లోకి దూసుకు వెళ్లారు. స్పీకర్ పోడియం వద్దే ఇద్దరు ఎంపీలు బైఠాయించారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ సహా మిగిలిన ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై యుపిఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో లోకసభలో పరస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను రెండుసార్లు వాయిదా వేశారు. మొదటిసారి పన్నెండు గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన సభ మళ్లీ గందరగోళానికి దారి తీయడంతో స్పీకర్ సభను రెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కూడా రాజ్యసభను రెండు గంటలకు వాయిదా వేశారు.

English summary
TRS MPs Vijayashanthi and K Chandrasekhar Rao sat at podium and demanded for Telangana bill in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X