తప్పు చేశాం: గాలి బ్రదర్స్ ఆగడాలపై సదానంద

రాజకీయ, ఇతర కారణాల వల్ల గాలి సోదరులకు ఎక్కువ అధికారాలు ఇచ్చామని, అది తప్పేనని ఆయన అన్నారు. బళ్లారి జిల్లాలో బిజెపిని తుడిచిపెడతామని శ్రీరాములు చేసిన ప్రకటనను ఆయన కొట్టిపారేశారు. ముగ్గురు శానససభ్యులు జి. సోమశేఖర రెడ్డి, బి. నాగేంద్ర, హెచ్‌టి మృత్యుంజయ జినాగాలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత సదానంద గౌడ ఆ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని శ్రీరాములుకు మద్దతిస్తున్న ఆ ముగ్గురు శాసనసభ్యులను పార్టీ ఆదేశించింది.
పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు జె. శాంత, సన్నా ఫకీరప్పలపై కూడా చర్యలు తీసుకుంటామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప చెప్పారు. శాంత శ్రీరాములు సోదరి.












Click it and Unblock the Notifications