వైయస్ దండుకున్నదెంత?: జగన్‌ను నిలదీసిన దూళిపాళ్ల

Dulipalla Narendra
హైదరాబాద్: పిపిఏలను సమీక్షించే పేరిట ప్రైవేటు కంపెనీలకు ఇరవై శాతం విద్యుత్‌ను బయటకు అమ్ముకోవడానికి అనుమతులిచ్చింది నీ తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియేనని అందుకు ఆయన దండుకున్నదెంతో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆదివారం నిలదీశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చంద్రబాబు హయాంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌లోని ఆరోపణలు అన్నీ అవాస్తవమన్నారు.

విద్యుత్ ఒప్పందాలు రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయన్నారు. ఆయన సంతకం కూడా చేశారన్నారు. ఈ ఒప్పందాల్లో రోశయ్య, జివికె, స్పెక్ట్రంలను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని దూళిపాళ్ల ప్రశ్నించారు. జగన్‌కు సదరు కంపెనీలకు ఉన్న రహస్య లావాదేవీలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గోబెల్స్‌కు వారసుడు అన్నారు. గోబెల్స్ ప్రచారంలో జగన్ గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+