దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి: ప్రభుత్వానికి గద్దర్ సవాల్

తెలంగాణ కోసం కిషన్‌జీ ఎంచుకున్న పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన మార్గంలో నడుస్తూ ఆయన తెలంగాణ కల నెరవేరుస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయడానికి చాప్టర్8 ఎలా ఉపయోగిస్తున్నారో కిషన్‌జీ ఎన్‌కౌంటర్ అలాగే ఉందన్నారు. ఆయన మృతదేహాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించక పోవడం అందులో భాగమేనన్నారు. శరీరం అంతా కుళ్లబొడిచి కిషన్‌జీని అతిదారుణంగా హత్య చేశారని వరవరరావు అన్నారు. కాగా కిషన్‌జీ మృతదేహాన్ని అర్ధరాత్రి రెండు గంటలకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించారు. మృతదేహాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications