నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, గ్రామాలు దిగ్బంధం

దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపేశారు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనని మత్స్యకార గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. కాళంగి నది పొంగుతున్న దొరవారిసత్రం మండలం తన్నీరుకమ్మగండ్రిక వద్ద ఓ వ్యక్తి ఏరుదాటుతుండగా కొట్టుకు పోయాడు. బాలాయపల్లి మండలంలోని పి.కొత్తపాలెం గ్రామంలో చెరువుకు గండి పడింది. చెన్నై, తిరుపతి, రాజంపేట, నెల్లూరు, గూడురు తదితర మార్గాల్లో రైళ్ల రాకపోలకలు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ధ్రోణి ప్రభావంతో బంగాళాఖాతం ఉగ్రరూపమెత్తింది.
కాగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ చెప్పారు. అధికారులంతా ఆదివారం విధుల్లోనే ఉన్నారని చర్యలు చేపడుతున్నారన్నారు. ఇప్పడి వరకు ఎక్కడా ప్రాంతాలు ముంపుకు గురి కాలేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications