కిషన్‌జీ పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు పూర్తి

మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని చందాపల్లిలో కిషన్‌జీ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. కిషన్‌జీ మృతదేహానికి వరవరరావు, కిషన్‌జీ సోదరుడు నిప్పు పెట్టారు. ఆయనను చూడటానికి భారీ ఎత్తున ప్రజలు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి తరలి వచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్, పౌర హక్కుల నేత వరవర రావు, విరసన నేత చలసాని ప్రసాద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ తదితరులు తరలి వచ్చారు. మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఆయన అంతిమయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులను భారీగా మోహరించారు.












Click it and Unblock the Notifications