నేను లేకుండా ఖాళీ చేస్తారా?: ఏడ్చిన లక్ష్మీపార్వతి

ఆ తర్వాత ఓ ఛానల్ సహకారంతో ఖాళీ చేయిస్తున్న రామకృష్ణతో మాట్లాడటానికి ఆమె ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు. తాను ఓ మహిళనని శనివారం రాత్రి వరకైనా తనకు సమయం ఇవ్వాలని ఆమె పలుమార్లు ఏడుస్తూ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయంలోగా ఇంటిని వారికి అప్పగించకుంటే తనను అరెస్టు చేసుకోవచ్చునన్నారు. ఇల్లు వద్దని డబ్బు తీసుకొని ఇప్పుడు ఖాళీ చేయించడం దారుణమన్నారు. అయితే గతంలో ఆమెకు ఇల్లు ఖాళీ చేసేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని అయినా ఆమె స్పందించక పోవడంతో ఫైనల్‌గా ఇలా చేస్తున్నట్టు చెప్పారు.
ఇళ్లు ఖాళీ విషయం తెలుసుకున్న లక్ష్మీ పార్వతి గుంటూరు నుండి హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు. కాగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ పోలీసులు, అధికారులతో వచ్చి ఇంటిని ఖాళీ చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications