సదస్సులో మంత్రులు సిఎం పరువు తీశారు: దేవేందర్

Devender Goud
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలపై చర్చించడానికి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రులే ఆయన పరువు తీశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గురువారం విమర్శించారు. రాష్ట్రంలో పాలన లేదన్న తమ ఆరోపణలకు కలెక్టర్ల సమావేశం అద్దం పట్టిందని అన్నారు. ప్రభుత్వం తీరును విపక్షాలు మాత్రమే కాకుండా మంత్రులే విమర్శించారన్నారు. కలెక్టర్ల సమావేశాన్ని ప్రభుత్వం చేపల మార్కెట్‌లా మార్చిందని ధ్వజమెత్తారు.

తాను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికే కిరణ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజా సమస్యల కోసం పెట్టినట్లుగా కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పథకాలపై మంత్రులకు సరైన అవగాహన లేదని ఆరోపించారు. సకల జనుల సమ్మె అయిపోయినా విద్యుత్ కోతల ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ప్రభుత్వం కోల్పోయిందన్నారు.

తెలుగుదేశం పార్టీ రైతుల సమస్యల గురించి పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోవడం విడ్డూరమని మరో నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలపై టిఆర్ఎస్‌కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+