ఎందుకు మాటిచ్చానో నాకే తెలియదు: వైయస్ జగన్

వైయస్ ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు కాబట్టే సువర్ణ యుగాన్ని ఇవ్వగలిగారన్నారు. వైయస్ చనిపోయినప్పుడు పావురాల గుట్ట వద్దకు వెళ్లి హెలికాప్టర్ ముక్కలు చెక్కలుగా పడి ఉండటం చూశానన్నారు. ఆ తర్వాత పెట్టిన సంతాప సభలో నాన్న కోసం చనిపోయిన కుటుంబాలను కలుస్తానని అప్పటికప్పుడు చెప్పానని ఆ మాట ఎందుకు చెప్పావంటే నా వద్ద సమాధానం లేదన్నారు. ఎందుకు ఆ మాట ఇచ్చానో నాకే తెలియదని, తన నోటి నుండి భగవంతుడే చెప్పించాడన్నారు. చనిపోయిన ప్రదేశం చూసి బాధ, భావోద్వేగానికి లోనై కుటుంబాలను ఓదార్చుతానని కల్మషం లేని మనసుతో చెప్పానన్నారు.
ఇచ్చిన మాటపై నిలబడినందుకు నాకు ఇప్పడు ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు. నేను పార్టీలో ఉన్నంత వరకు నా వద్దకు ఒక్కరు రాలేదని ఇప్పుడు మాత్రం సిబిఐ, ఈడి, కోర్టు కేసులు అన్నీ ఇబ్బందులేనన్నారు. నేను చేసిన తప్పేమిటో నాకర్థం కావడం లేదన్నారు. ఓదార్పు యాత్ర ద్వారా తాను పేదల కన్నీళ్లను చూస్తున్నానని అన్నారు. త్వరలో సువర్ణయుగం రాబోతుందన్నారు.












Click it and Unblock the Notifications