ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేత హత్య కేసులో ఏడుగురిపై కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

khammam
ఖమ్మం: ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత చిట్టి బాబు హత్య కేసులో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస రావు, కాంట్రాక్టర్ దీపక్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం స్పాంజ్ ఐరన్ ఓర్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక టిడిపి నేత చిట్టిబాబు మరికొందరితో కలిసి వాహనాలను అడ్డుకున్నారు. అక్రమ తరలింపు జరగనివ్వమని హెచ్చరించారు. డ్రైవర్లు, చిట్టి బాబుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

వాగ్వాదం ముదిరి డ్రైవర్లు ఇనుప రాడ్‌లతో చిట్టి బాబును దారుణంగా కొట్టారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కాకిరాయి క్వారీపై దాడి చేశారు. ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. జనరేటర్ ధ్వంసం చేశారు. చిట్టి బాబు మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి డిమాండ్ చేసింది. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

English summary
Police booked case against seven accused in TDP leader Chitti Babu murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X