చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇష్టసఖికి షాకిచ్చిన జయలలిత, పార్టీ నుండి సస్పెండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha and Sasikala
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన నిర్ణయం ద్వారా మరో సంచలనానికి తెరదీశారు. తన ఇష్ట సఖి శశికళపై జయలలిత వేటు వేశారు. శశికళను అన్నాడిఎంకే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే శశికళను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఇంకా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. శశికళతో పాటు పన్నెండు మంది పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అందులో పెంపుడు కొడుకు కూడా ఉన్నట్లు సమాచారం. శశికళతో జయలలితకు ముప్పయ్యేళ్ల బంధం ఉంది. కష్టకాలంలో శశికళ జయకు అండగా ఉన్నారు. రాజకీయంగా, కేసులపరంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె నుండి శశికళ దూరం పోలేదు. అలాంటి శశికళపై వేటు వేయడం సంచలనం సృష్టిస్తోంది.

ఐఏఎస్ అధికారులు శశికళకే నేరుగా ఫిర్యాదు చేయడం, రాజ్యాంగేతర శక్తిగా ఎదగడం జీర్ణించుకోలేని జయలలిత ఆమెను సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయతో పాటు శశికళ ప్రధాన నిందితురాలు. కాగా శశికళపై వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అక్రమాస్తుల కేసు నుండి బయటపడేందుకే జయ వేసిన ఎత్తుగడ అని, శశికళపై ఆస్తుల కేసు మోపేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

English summary
Tamilandu CM Jayalalitha suspends Sasikala from party. Sasikala is close friend to Jayalalitha from thirty years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X