వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ శశికళ: జయలలితకు ఎలా దగ్గరయ్యారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sasikala
చెన్నై: తన ఇష్టసఖి శశికళపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేయడంతో, వారిద్దరి మధ్య అనుబంధం మరోసారి చర్చనీయాంశంగా మారింది. శశికళ, జయలలిత శరీరాలు వేరు గానీ ఆత్మలు ఒక్కటే అన్నట్లుగా ఉంటూ వస్తున్నారు. అకస్మాత్తుగా శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ పార్టీ నుంచి వెలివేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అందులోని ఆంతర్యమేటనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జయలలిత నివాసంలో శశికళ ఆదేశాలు లేకుండా చీమైనా కుట్టదనే పరిస్థితి. శశికళ దయాదాక్షిణ్యాలు లేకుండా జయలలిత కడగంటి చూపులు కూడా ఎవరికీ దక్కని స్థితి. జయలలిత వ్యక్తిగత విషయాలతో పాటు పార్టీ వ్యవహారాలు కూడా శశికళ చూసుకుంటూ వస్తున్నారు.

సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా సామాజిక రంగంలో కూడా జయలలితను అందరూ దూరంగా పెట్టిన సమయంలో శశికళ దగ్గరయ్యారు. జయలలితకు పరిచయం కాక ముందు శశికళ ఓ వీడియో షాపు నిర్వాహకురాలు. తిండికి కూడా కటకటలాడే స్థితి అంటారు. జయలలితకు సినిమా వీడియోలు తీసుకుని వెళ్లే పనిమనిషి ద్వారా శశికళ పరిచయం ఏర్పడిందని అంటారు. అయితే, మరో ప్రచారం కూడా ఉంది. అప్పటి ఐఎఎస్ అధికారి చంద్రకళ ద్వారా శశికళ జయలలితకు పరిచయమయ్యారని అంటారు. చంద్రకళపై అన్నాడియంకె కార్యకర్తలు యాసిడ్ దాడి కూడా చేశారు. దాంతో ఆమె పదవికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారని చెబుతారు.

జయలలిత పెంపుడు కుమారుడు సుధాకరన్ వివాహం వైభోగం గురించి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. సుధాకరన్ అక్క కుమారుడైన సుధాకరన్ శివాజీ గణేషన్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. దాంతో శివాజీ గణేషన్‌ను పెళ్లికి ఒప్పించడానికి జయలలిత సుధాకరన్‌ను తాను దత్తత తీసుకున్నట్లు చెప్పి వైభవంగా పెళ్లి చేశారు. 1995లో ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నాడియంకె ఓడిపోయింది. ఆమెపై ఏడు కేసులు కూడా నమోదయ్యాయి. శశికళ రెండు టీవీ చానెళ్లు పెట్టారు. ఓ చానెల్ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఆ సమయంలో శశికళపై జయలలిత వేటు వేశారు. తనకు పెంపుడు కుమారులెవరూ లేరని కూడా చెప్పారు. ఐదారేళ్ల తర్వాత మళ్లీ దగ్గరకు తీశారు.

అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న శశికళ వ్యవహార శైలి పూర్తిగా మారిందని, ఐఎఎఎస్, ఐపియస్ అధికారులను తన అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నారని జయలలిత దృష్టికి వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా, కేసుల్లో జయలలితకు శిక్ష పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా చెప్పుకుంటున్నారని సమాచారం. దీంతో తీవ్రంగా మండిపడిన జయలలిత శశికళపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా వేటు వేసినట్లు తెలుస్తోంది.

English summary
The relation between Sasikala and Jayalalithaa has became a hot topic again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X