గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'దొంగలు' వ్యాఖ్యలపై మంత్రులు వర్సెస్ దూళిపాళ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
గుంటూరు: ఎత్తిపోతల పథకాలు - చిన్న నీటి పారుదల అభివృద్ధి అనే అంశంపై శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశం గందరగోళంగా మారింది. ఎత్తిపోతల పథకాలపై సమీక్ష జరుగుతుండగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదానికి దారి తీశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కాసు కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పిట్టంబండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరుగుతుండగా టిజి మాట్లాడుతూ రైతులు దొంగలో కాంట్రాక్టర్లు దొంగలో తేలుస్తామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై దూళిపాళ్ల నిరసన వ్యక్తం చేశారు. రైతులు దొంగలు అన్నపదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రులు తాము రైతులను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేశారు. దూళిపాళ్ల మాత్రం ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు.

English summary
TDP MLA Dulipall Narendra walk out from review meeting in Guntur district for minister theft comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X