హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి ఆర్థిక ఉగ్రవాది, బెయిల్ ఇస్తే అంతే: సిబిఐ వాదన

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిలు ఇవ్వడమంటే సాక్షుల ప్రాణాలను ప్రమాదంలోకి తోయడమేనని, ప్రకృతి వనరులను, సహజ సంపదను ఆయన దోచుకున్నారుని, ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డ ఉగ్రవాది గాలి అని సిబిఐ వాదించింది. కరడుగట్టిన నేరగాడని, అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి అని, మైనింగ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ముందే కనీసం నలుగురు సాక్షులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, పోలీసు రక్షణ కల్పించాలని సీబీఐని వేడుకున్నారని తెలిపింది. ఒక సాక్షి తనకు గన్‌మెన్ భద్రతతోపాటు గన్ లైసెన్సు ఇప్పించాలని ప్రాధేయపడ్డారుని, ఇలాంటి పరిస్థితుల్లో గాలికి బెయిలు ఇవ్వడం ఎంతమాత్రం తగదని అని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పరాశరణ్ గురువారం ప్రత్యేక కోర్టులో వాదించారు.

గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో గాలి, శ్రీనివాస రెడ్డి బెయిలు పిటిషన్లపై విచారణ జరిగింది. "ఓఎంసీ కేసులో చార్జ్‌షీటు దాఖలు చేశాం. ఇందులో 201 మంది సాక్షులున్నారు. ఈ దశలో కీలక నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు బెయిల్ ఇస్తే సాక్షుల్లో చాలామంది ఇబ్బంది పడతారు. ఈ కేసులో అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ సమయంలో బెయిలు పిటిషన్‌ను అనుమతించడం వల్ల కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది'' అని పరాశరణ్ తెలిపారు. గాలి నుంచి ముప్పు ఉందంటూ సీబీఐకి లేఖలు రాసిన వారి వివరాలు, లేఖల్లోని సారాంశాన్ని ఆయన కోర్టుకు తెలియచేశారు. వాటిని గాలి తరఫు న్యాయవాది కూడా పరిశీలించారు. ఈ సమయంలో ఓపెన్ కోర్టులో సాక్షుల పేర్లు వెల్లడి కావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. పేర్లు బయటపడితే సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని న్యాయమూర్తి నాగమారుతీ శర్మ దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టు విధించే అన్ని షరతులను తన క్లయింట్ పాటిస్తారని, బెయిలు ఇవ్వాలని గాలి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మూడు రోజుల్లోనే బెయిల్ ఇచ్చారని, రాజగోపాల్‌కు కూడా బెయిలు మంజూరైందని, వీరికన్నా ముందు అరెస్టు అయిన గాలికి మాత్రం బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. విచారణకు సహకరిస్తామని చెబుతూ బెయిలు ఇవ్వాలని కోరారు. అన్ని విధాలా బెయిలుకు గాలి అర్హుడన్నారు. శ్రీనివాస రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఆయన న్యాయవాది సురేందర్‌రావు కూడా ఇదే తరహా వాదనలు విన్పించారు. న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

English summary
CBI terms Karnataka ex minister Gali Janardhan Reddy as financial terrorist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X