చంద్రబాబుకు ఉరేయ్: మోత్కుపల్లికి చంద్రశేఖర్ సవాల్

విద్యార్థులపై వందలాది కేసులున్నాయని మాట్లాడుతున్న మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌పై, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై ఎన్ని కేసులున్నాయో తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. మోత్కుపల్లి అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలపై, తెలంగాణ విద్యార్థుల త్యాగాలపై మోత్కుపల్లికి గౌరవం ఉంటే తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుకు ఉరేయాలని ఆయన అన్నారు. మోత్కుపల్లి వ్యవహరించే తీరు అది కాదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనపై చిత్తశుద్ధి ఉంటే గతంలో కెసిఆర్ మాదిరిగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని, తనతో కలిసి వచ్చేవారిని కలుపుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కలిసి రావడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అందరం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామంటూ ముందుకు రావాలని ఆయన మోత్కుపల్లికి సూచించారు. మోత్కుపల్లిని తమ జాతి నుంచి బహష్కరిస్తున్నామని ఆయన అన్నారు. అంబేడ్కర్‌ను కూడా మోత్కుపల్లి అవమానిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications