జగన్‌తో ఢీ, నాలుగు సీట్లలో చిరంజీవికి పరీక్ష

సీమాంధ్రలో జరిగే ఉప ఎన్నికల భారాన్ని చిరంజీవిపై మోపాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వైపు వెళ్లిన 16 మంది తమ పార్టీ శానససభ్యుల స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో చిరంజీవి తన సత్తా చాటాల్సిన పరిస్థితిలో పడ్డారు. అయితే, ఈ 16 స్థానాల్లో చిరంజీవి వర్గానికి నాలుగు స్థానాలని ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయించుకుందని అంటున్నారు. ఈ నలుగురిని గెలిపించుకోవాల్సిన బాధ్యత చిరంజీవిపై పెడుతారని చెబుతున్నారు. ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు గెలిస్తేనే చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో తగిన స్థానం లభిస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటికీ చిరంజీవికి తగిన పదవిని అప్పగించడంలో కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేస్తూ వస్తోంది. తగిన సమయంలో పదవులు ఇస్తామంటూ చెబుతూ కాలయాపన వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికల పేరు చెప్పి పదవి ఇవ్వడంలో మరింత జాప్యం చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications