వైయస్ వారసత్వం సమాధి, కిరణ్ కుమార్ రెడ్డికి స్వేచ్ఛ

తనకు ఇబ్బందులు కలిగిస్తున్న మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు వైయస్ ముద్ర లేని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జలయజ్ఞం వంటి పథకాలను రూపాయికి కిలో బియ్యం, జలప్రభ వంటి పథకాలుగా మార్చేసి తన పథకాలుగా ప్రచారం చేసుకోవడంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కొంత ఫలితం సాధించారని అంటన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రమాదం కూడా పూర్తిగా తొలగిపోయినట్లేనని అంటున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ తలనొప్పి కూడా దాదాపుగా సమసిపోయినట్లేనని చెబుతున్నారు. సమన్వయ కమిటీలో ఉన్న కావూరి సాంబశివరావు, చిరంజీవి సమైక్యవాదులు కాగా, డి. శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ తెలంగాణ పేరుతో సమస్య సృష్టించే నాయకులు కారు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనే కాస్తా తలనొప్పి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కమిటీ చైర్మన్ హోదాలో గులాం నబీ ఆజాద్ ఎప్పటికప్పుడు బొత్సను కట్టడి చేస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications