సబితా ఇంద్రారెడ్డిపై మంత్రి శంకరన్న ప్రత్యక్ష వార్

P Shankar Rao
హైదరాబాద్: హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు ప్రత్యక్ష సమరానికి దిగారు. సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. సబితా ఇంద్రారెడ్డి పట్ల ముఖ్యమంత్రి ఉపేక్ష వహిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నవారిని సహించడం సరి కాదని ఆయన అన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై కేసు పెట్టి, మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

హైదరాబాదు సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌లో అమాయకులపై, వృద్ధులపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. దాడులు జరిగి చాలా రోజులైనా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. హోం శాఖలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారున్నారని ఆయన అన్నారు. మంత్రి శంకరరావుపై దాడికి నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎల్పీ నగర్‌లో దళిత గర్జన నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కార్తిక్ రెడ్డిపై, శాససభ్యుడు సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+