యుపి సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Qureshi
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఇసి) శనివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ శానససభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని 403 శాసనసభా స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. 2012 ఫిబ్రవరి 4, 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 28 తేదీన పోలింగ్ ముగుస్తుంది. గోవా శానససభా ఎన్నికలు మార్చి 3వ తేదీన జరుగుతాయి. మణిపూర్ శాసనసభకు జనవరి 28వ తేదీన పోలింగ్ జరుగుతుంది. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్‌ శానససభల ఎన్నికల పోలింగ్ జనవరి 30వ తేదీన జరుగుతుంది.

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా మార్చి 4వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచే అమలులోకి వస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను (ఇవిఎంలను) వాడుతారు. స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్ ఖురేషీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు శాసనసభా స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల విషయంలో కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని ఖురేషీ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+