కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప మృతి

Bangarappa
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కన్ను మూశారు. బెంగళూరులోని ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. బంగారప్ప 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభ సభ్యుడిగా 1996 వరకు కొనసాగారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన 1990 - 1992 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996, 1999, 2003, 2005 ఎన్నికల్లో లోకసభకు ఎన్నికయ్యారు.

మధ్యలో ఆయన బిజెపిలోకి, సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లారు. అయితే, మళ్లీ కాంగ్రెసులోకి తిరిగి వచ్చారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. బంగారప్ప మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ, గవర్నర్ భరద్వాజ్ సంతాపం ప్రకటించారు. బంగారప్ప మల్యా ఆస్పత్రిలో మూత్ర సంబంధమైన వ్యాధులకు చికిత్స పొందుతూ మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+