లిక్కర్ సిండికేట్లు: బొత్సకు, సిఎంకు మధ్య విభేదాలు

మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం సిండికేట్లతో తనకు ప్రమేయం లేదని చెబుతూ ఆ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బొత్స సత్యనారాయణ ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని చెప్పారని అంటున్నారు. ఎసిబి దాడులకు సంబంధించి నివేదిక తన వద్ద ఉందని, దాన్ని పరిశీలించిన తర్వాత అవసరమైతే సిబిఐ విచారణకు అడుగుదామని కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణతో చెప్పినట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి వివరణతో ఆయన సంతృప్తి చెందకుండా పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications