హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: టిడిపి నేత పరిటాల రవి హత్య కేసులో సిబిఐ తనకు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేస్తే ఆయన పార్టీకి సానుభూతి వస్తుందనేది వాస్తవమేనని, ఆ సానుభూతి దీర్ఘకాలం ఉండదని, అయినా దాంతో తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జగన్‌ను కాంగ్రెసు వేధిస్తోందని చెప్పడం వాస్తవం కాదన్నారు. హైకోర్టు ఆదేశాలతోనే సిబిఐ విచారణ జరుగుతోందని, కేంద్రం జోక్యం లేదన్నారు. సిబిఐ కాంగ్రెసు సూచనల మేరకే పని చేస్తుందన్న జగన్, పరిటాల రవి హత్య కేసులో ఆయనకు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. జగన్ ఎమ్మెల్యేలపై వేటు ఆలస్యమౌతోందన్నారు. ఆలస్యానికి కారణం స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు.

జగన్ ఫీజు ధర్నా రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెసు పార్టీ శాసన మండలి విప్ నేత శివ రామి రెడ్డి వేరుగా అన్నారు. అర్హులైన అందరికీ కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న బకాయిలను కూడా చెల్లించిందన్నారు. జగన్ పోరు చేసినంద మాత్రాన విద్యార్థులు నమ్మరన్నారు. జగన్ వర్గం శాసనమండలి సభ్యులపై నాలుగైదు రోజ్లులో శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి ఆధారాలు సేకరించాకే ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

English summary
Congress senior leader JC Diwakar Reddy questioned YS Jaganmohan Reddy that why he did not respond on Paritala Ravi case, when he get clean chit from CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X