హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీపై ఆజాద్ ఆరా, తెలంగాణ జాప్యంపై వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రలో జగన్, తెలంగాణ సమస్యలు ఇప్పుడు కాంగ్రెసు ముందున్నాయి. గురువారం తనను కలిసిన సీమాంధ్ర నేతలను ఆయన జగన్ పార్టీ ప్రభావంపై అడిగినట్లుగా సమాచారం. జగన్ చేస్తున్న యాత్రలు, వాటికి ప్రజల నుండి వస్తున్న స్పందనపై ప్రశ్నించారట. నేతలు తమ తమ అభిప్రాయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్‌కు సానుభూతి ఎక్కువ కాలం ఉండదని, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని నాయకులు ఆయనకు చెప్పినట్లుగా సమాచారం. అదే సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తొందరగా వేటు వేయాలని పలువురు అభిప్రాయపడినట్లుగా సమాచారం.

తెలంగాణ మంత్రులు ఆజాద్‌ను వేరుగా కలిసి తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆజాద్, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంలో జరుగుతున్న ఆలస్యానికి కారణం మీకు, నాకు తెలుసని, ప్రస్తుతం ఎన్నికల ఉన్న దృష్ట్యా ఆ ప్రకటన ప్రభావం వాటిపై పడే అవకాశముందని వారితో అన్నారు. అయినా తెలంగాణ అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ నేతలతో సంప్రదింపులు జరుపుతానని వివరించారు. ఆలస్యమైనప్పటికీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు అంటే ఆయన నవ్వి ఊరుకున్నారు.

English summary
Union Minister Ghulam Nabi Azad asked party leaders about YS Jaganmohan Reddy and his party effect on party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X