గుంటూరులో నిత్య పెళ్లి కొడుకు దారుణ హత్య

ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం - నరేంద్ర ఇప్పటి వరకు పంజాబ్‌కు చెందిన ఓ యువతిని, తెనాలికి చెందిన డాక్టర్‌ను, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాదులో ఉంటోంది. అమెరికాలో పంజాబ్‌కు చెందిన యువతిని నరేంద్ర పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నరేంద్ర తీరు నచ్చక ఆమె విడాకులు ఇచ్చేసి పంజాబ్‌కు చేరుకుంది. హైదరాబాదులో ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తిపై అతను యాసిడ్ దాడి కూడా చేశాడు. తాను అమెరికాలోని మిలీనియం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సిఎండిని అని చెప్పి బుట్టలో వేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. పేర్లు మార్చుకుని, అద్దె తల్లిదండ్రులతో పెళ్లి చూపులు, ఇతరత్రా వ్యవహారాలు నడిపిస్తూ వచ్చాడు.
నరేంద్ర నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవాడు. అతని మేనమామ అని చెప్పే ఓ వ్యక్తి తప్ప మిగతా కుటుంబ సభ్యులెవరో కూడా తెలియదు. ఓ కేసులో అమెరికాలో నరేంద్రకు 20 నెలల జైలు శిక్ష పడింది. పైకోర్టుకు వెళ్లడంతో దాన్ని పది నెలలకు కుదించింది. ఆ తర్వాత ఇండియాకు పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుని మోసాలు చేయడం ప్రారంభించాడు. నేనే సిఎం అయితే వంటి సినిమాలను కూడా అతను తీసినట్లు సమాచారం. నాయుడుపేటకు చెందిన నరేంద్ర మేనమామ మూడు పెళ్లిళ్లకు హాజరయ్యాడు. అతన్ని అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications