బాబు ప్రసంగిస్తుండగా వేదికపైకి చెప్పులు, రాళ్లు

సిగ్గుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రైతుల కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని ఆయన అన్నారు. రైతులకు తమ మద్దతు ఉంటుందని, చివరి రక్తంబొట్టు వరకు రైతుల కోసం పోరాడుతానని ఆయన అన్నారు. ఇప్పటికైనా తెరాస నాయకులు మారాలని, చేతనైతే ప్రజలను నమ్మించుకోవాలని ఆయన అన్నారు. తాను రైతుల కోసం వచ్చానని ఆయన అన్నారు. బస్సులు, కార్లు, ఆటోలు తగులబెట్టారని ఆయన ఆరోపించారు. టిడిపిని అంతం చేయాలనుకునే వారు మట్టిలో కొట్టుకుపోతారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తాము పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చి పార్టీ పెట్టారని, పదవి ఇస్తే పార్టీ పెట్టేవారు కారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు.
తెలంగాణకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు రాజకీయ లబ్ధి కోసం ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెసును కలుపుకుని అక్కడ, తెరాసను కలుపుకుని ఇక్కడ తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడాలని ప్రోత్సహించానని, తాను ఎప్పుడూ వ్యతిరేకంగా చేయలేదని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు కంపులో కలిసిపోయిందని ఆయన అన్నారు. తెరాస కూడా రేపో ఎల్లుండో కాంగ్రెసులో కలిసిపోతామని అంటున్నారని ఆయన అన్నారు. సున్నితమైన అంశం మీద తాను చెప్పాల్సింది చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుని అస్థిరతను తొలగించాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను భవిష్యత్తులో కూడా మాట్లాడబోనని ఆయన అన్నారు. పార్టీని కాపాడి భావి తరాలకు అందించాలని మాత్రమే అనుకుంటున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications